Jaan Say Shooting Update: ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ ఒక కొత్త ఫేజ్ లో ఉంది. కొత్త తరహా కథాంశాలతో క్వాలిటీ గా రూపొందుతున్న సినిమాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. సినిమా పట్ల నిబద్దతతో ఫ్రెష్ సబ్జెక్ట్స్ తో వస్తున్న కొత్త దర్శకులు తమ సత్తా చాటుతున్నారు.
ఈ నేపథ్యంలో పరిశ్రమతో ఎటువంటి సంబంధం లేని కేవలం సినిమా మీద ప్యాషన్ తో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు ఎస్. కిరణ్ కుమార్. కృతి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ No 1 గా ‘జాన్ సే’ టైటిల్ తో కిరణ్ కుమార్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం లో రూపొందిస్తున్నారు.
క్రైమ్ థ్రిల్లర్ డ్రామా గా తెరకెక్కుతున్న జాన్ సే లో యువ జంట అంకిత్, తన్వి హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. థ్రిల్లింగ్ అంశాలతో పాటు లవ్ స్టొరీ కూడా కీ రోల్ ప్లే చేసే ఈ చిత్రం దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ నెలాఖరు వరకు జరిగే షెడ్యుల్ తో పూర్తి షూటింగ్ పూర్తవుతుంది.
Downvoting a post can decrease pending rewards and make it less visible. Common reasons:
Submit