#పురాణము అనగా.....ఎన్నిపురాణాలు ?వివరణ :# Myth is ...... How many variables? Description:steemCreated with Sketch.

in how •  7 years ago 

gmat_myths_articled.jpg

వేదాలు ప్రజలకు క్లిష్టమైనవి కనుక అందుబాటులో లేనివి కనుక వేదవ్యాసుడు వేద ఉపనిషత్తు సారంతో కూడిన అష్టాదశ పురాణాలను రచించాడు. పురాణాలను వ్యాసుడు తన శిష్యుడైన రోమహర్షణుకి చెప్పాడు. రోమహర్షుడు తిరిగి వాటిని తన శిష్యులైన త్రైయారుణి, కశ్యపుడు, సావర్ణి లాంటి శిష్యులకు అందించాడు. ఆ తర్వాత అలా ఒకరి నుండి ఒకరికి సంక్రమించాయి.

#పురాణం_లక్షణాలు......

ప్రతి పురాణం కుడా పురాణాల ముఖ్యమైన లక్షణాలను మొదటి సర్గలలో చెబుతుంది. కూర్మపురాణంలో చెప్పబడిన పురాణ ఉపోద్ఘాతము ప్రకారం

సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ
వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం

సర్గము, ప్రతి సర్గము, వంశము, మన్వంతరము, వంశాలచరిత్ర అనే పంచలక్షణాలు కలిగినదే పురాణం.

సర్గము - సర్వ ప్రపంచ సృష్టిని విస్తరించేదిప్రతి సర్గము - సకల ప్రపంచము లయమయ్యే లక్షణం తెలిపేది (ప్రళయం)వంశము - పృథు, ప్రియ వ్రతాదుల వంశోత్పత్తిని వివరించుటమన్వంతరము - ఏ కల్పంలో ఏ మనువు కాలంలో ఏమి జరిగిందో తెలుపుటవంశాలచరిత్ర.

** ●వర్గీకరణ●******

మహాపురాణాలు దైవము యొక్క మూడు రూపములు ప్రకారంగా వర్గీకరించ బడ్డాయి. త్రిమూర్తి:

#వైష్ణవపురాణాలు:విష్ణు పురాణం, భాగవత పురాణం,నారద పురాణము, గరుడ పురాణం,పద్మ పురాణము, వరాహ పురాణం,వామన పురాణము, కూర్మ పురాణం,మత్స్య పురాణము #బ్రహ్మపురాణాలు:బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణం,బ్రహ్మ వైవర్త పురాణం, మార్కండేయ పురాణము, భవిష్య పురాణం.
#శైవపురాణాలు:శివ పురాణము, లింగ పురాణము,స్కంద పురాణం, అగ్ని పురాణం.

◆అష్టాదశ పురాణాలు◆ ఏ పురాణము ఏమి చెప్తుంది?..◆

(1)బ్రహ్మ పురాణం - బ్రహ్మదేవుడు మరీచికి బోధించినది. 10,000 శ్లోకములు కలది.

(2)పద్మ పురాణము - బ్రహ్మదేవునిచే చెప్పబడినది. 55,000 శ్లోకములు కలది.

(3)విష్ణు పురాణం - పరాశరుని రచన. దీనిలో 63,000 (8,000?) శ్లోకములు ఉన్నాయి.

(4)శివ పురాణం - వాయుదేవునిచే చెప్పబడినది. ఇందులో 24,000 శ్లోకాలున్నాయి.

(5)లింగ పురాణము - నందీశ్వరుని రచన. 11,000 శ్లోకాలు ఉన్నది.

(6)గరుడ పురాణం - విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పిన ఈ పురాణంలో 19,000 (16,000?) శ్లోకాలున్నాయి.

(7)నారద పురాణము - నారద మహర్షి రచన. 24,000 (25,000?) శ్లోకములు కలది.

(8)భాగవత పురాణం- శుకమహర్షి పరీక్షిత్తునకుపదేశించినది. 18,000 శ్లోకములు కలది.

(9)అగ్ని పురాణం - భృగుమహర్షిచే చెప్పబడినది. 16,000 (8,000?) శ్లోకములు కలది.

(10)స్కంద పురాణం - కుమారస్వామిచే చెప్పబడినది. 80,000 (లక్ష?) ఇందు శ్లోకములు ఉన్నాయి.

(11)భవిష్య పురాణం లేదా భవిష్యోత్తర పురాణం - శతానీకుడు సుమంతునకు బోధించినది. 14,500 (31,000?) శ్లోకములు ఉన్నాయి.

(12)బ్రహ్మవైవర్త పురాణం - వశిష్ట మహర్షి అంబరీషునకు ఉపదేశించినది. 18,000 (12,000) శ్లోకములు కలది.

(13)మార్కండేయ పురాణం - పక్షులు క్రోష్టి (జైమిని) కి చెప్పినట్లుగా మార్కండేయమహర్షి రచించెను. 9,000 (32,000?) శ్లోకములు ఉన్నది.

(14)వామన పురాణము - బ్రహ్మదేవుని రచన - 14,000 శ్లోకములు కలది.

(15)వరాహ పురాణం - శ్రీవరాహమూర్తి భూదేవికి ఉపదేశించినది. ఇందు 24,000 శ్లోకములు ఉన్నాయి.

(16)మత్స్య పురాణం - శ్రీమత్స్యావతారుడైన విష్ణువు మనువునకు ఉపదేశించెను. దీనిలో 14,000 శ్లోకాలున్నాయి.

(17)కూర్మ పురాణం - శ్రీకూర్మావతారుడైన విష్ణువు ఉపదేశించెను. దీనిలో 17,000 (6,000) శ్లోకాలున్నాయి.

(18)బ్రహ్మాండ పురాణం - బ్రహ్మదేవుని రచన- 1,100 (12,200?) శ్లోకములున్నది............

★ఈ అష్టాదశపురాణాలే కాకుండా #ఉపపురాణాలు కూడా 18 ఉన్నాయి. ★అవి:

(1)నరసింహ(2)శివధర్మ(3)దౌర్వాస(4)నారదీయ పురాణము(5)కాపిల(6)మానవ(7)ఔసనశ(8)బ్రహ్మాండ(9)వారున(10)కౌశిక(11)లైంగ(12)సాంబ(13)సౌర(14)పారాశర(15)మారీచ(16)భార్గవ(17)స్కాంద(18)సనత్కుమార..

Authors get paid when people like you upvote their post.
If you enjoyed what you read here, create your account today and start earning FREE STEEM!