అందరికి నమస్కారం!
తెలుగు భాష గొప్పతనం గురించి ఒక వ్యాసం మనం ఈరోజు చెప్పుకుందాం.
తెలుగు భాష మన మాతృభాష! ఒక ప్రాంతంలో జీవించే జనుల మద్య సంభాషణకు ఉపయోగించే సహజమైన భాష, ఆ ప్రాంతపు భాషగా గుర్తింపు పొందుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో అందరూ అదే భాషలో మాట్లాడుకోవడం జరుగుతుంది. అలా మన రెండు రాష్ర్టాలలోనూ ప్రజలు ప్రధానంగా తెలుగులోనే మాట్లాడుకుంటారు. చిన్పప్పటి నుండి మన అమ్మ దగ్గరే నేర్చుకునే భాష మాతృభాష అయితే తెలుగు రాష్ట్రాలలో అమ్మ దగ్గర నుండి మాటలు నేర్చే భాష మన తెలుగు భాష.
తెలుగు భాష గొప్పతనం గురించి చెప్పాలంటే, మన తెలుగు భాషపై పూర్వుల రచించిన పుస్తకాలు చదవాలి. పండితుల రచనలు చదివితే తెలుగు భాష గొప్పతం గురించి అవగాహన వస్తుంది. వారు చక్కగా తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేవిధంగా వివరించారు. తెలుగు భాషలో ఎన్నో గొప్ప కవితలు, భక్తి గీతాలు, గొప్ప పద్యాలు, గొప్ప విషయాలు, గొప్ప పుస్తకాలు…. ఎంతో గొప్పదనం తెలుగు భాష సాహిత్యంలో ఉంది. అది తెలియడానికి తెలుగు భాషలో రచనలు, వ్యాసాలు, విశ్లేషణలు, గొప్పవారి అభిప్రాయాలు, గొప్పవారితో సంభాషించడం వంటివి చేయాలి. అప్పుడే తెలుగు భాష గొప్పతనం తెలియబడుతుంది. తెలుగు భాష గొప్పతనం అర్ధం అవుతుంది. ఇంగ్లీషులో మాట్లాడితే, ఇంగ్లీష్ టాకింగ్ ఇంప్రూవ్ అయినట్టుగానే, అసలు తెలుగు భాషలో మాట్లాడితనే, తెలుగు భాష గొప్పతనం గురించి తెలుస్తుందని అంటారు. తెలుగు మాట్లాడే ప్రాంతాలు అంటే తెలుగే వాడుక భాషగా ఉన్న ప్రాంతాలు. ఆ ప్రాంతాలలో వాడుక భాష తెలుగంటే, అమ్మ దగ్గర నుండి మనకు పరిచయం అయ్యే భాష మన మాతృభాష తెలుగు భాష కాబట్టి అనేక భావనలకు తెలుగు మాటలు వలననే అవగాహన వస్తుంది.