తెలంగాణ RTC కార్మికుల సమ్మె లోని నిజాలు.

in telangana •  5 years ago  (edited)

ఉద్యమం ఎప్పుడూ ఒకరి హక్కు ఇంకొకరు దోచుకునప్పుడు, తమ పరిస్తితి మార్చే గలిగె శక్తి ఉన్న అధికారం ఆ పని చేయని రోజున వెల్లువే బయటికి వస్తుంది.
ప్రతి ఉద్యమం ఉద్యమకారడి అవసరం కోసమే, తన జీవితాన్ని లాభం జర్పటాన్కే.
తెలంగాణ పోరాటం జరిగిన రోజుల్లో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా , తన పార్టీ నీ కాంగ్రెస్ లో కలిపెస్త అన్న దొర వెంటనే ముఖ్యమంత్రి అవటం ఎవరికి తప్పు అనిపించలేదు.
ఎందుకంటే తెలంగాణ తెచ్చింది ఆయనే, ఉద్యమాన్ని నడిపింది ఆయనే అని జనం నమ్మారు. గుత్తం గా అధికారం ఇచ్చారు.
మరి ఆయన ఒక్కడే ఉపవాసం ఉంటే వచ్చిందా అంటే, విద్యార్థుల ఆత్మ బలిదనాలు, ప్రభుత్వ ఉద్యోగుల కొలువులకు నిరహజరు, వేల మంది ఆర్టీసీ కార్మికుల వీధుల బహష్కరిన కొండంత అండగా ఉన్నాయి. అవే లేకపోతే ఈరోజు ఆర్టీసీ కార్మిక ఐకాస నాయకుడు అశ్వద్ధామ రెడ్డీ ఉపవాస దీక్ష మాదిరి రెండు రోజుల్లో దొర జెండా ఎత్తి జేబు లో పెట్టుకోవాల్సి వచ్చేది.

ఇక్కడ ఎంత సేపు కార్మికులను ప్రజల ముందు రాష్ట్రానికి భారం గా, నష్టాలు తప్ప ఎందుకు ఉపయోగం లేని వారి గా చిత్రించే ప్రయత్నం ముందు నుంచి జర్గుతు వస్తోంది.

✓ దసరా కి నెల రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చినపుడు, దొర ఎందుకు పండగ కి ముందే స్పదించలేదు?
కరెక్ట్ గా కార్మికులే కావాలని పండగ రోజు సమ్మె చేసి ప్రజల కు తీవ్ర అసౌకర్యం కలిగించిన వారి గా మాట్లాడారు. సమ్మె పై పండగ ముందే అందుకు చర్చలకు పిలవలేదు?

✓ ఆర్టీసీ కార్మికుల జీతాలు సగటున యాబై వెలూ ఉన్నాయి, ఆయన గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారు.
ఒక పవర్ ప్లాంట్ లో 25 యేళ్లు చేసిన attender ki లక్ష తొంబే వెలు జీతం వస్తుందని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ 25-30 సంవత్సరాలు ఆర్టీసీ సంస్థ కోసం 400 వందల జీతం కి చేరిన వాళ్ళు తెలంగాణ వచ్చాక 44 fitment పెంచాక కానీ ఒక 20 years experience unna mechanic ki పట్టుమని పాతికవేల జీతం రాలేదు. Payslip Lu పట్టుకొని కార్మికుల డిపో ల ముందు ఉన్నారు వెళ్లి చూడండి.
Online lo comment పెట్టే వారంతా, ఇప్పటికి ఇప్పుడే ఏడు వందల జీతానికి చెరటాన్కి ready ఉన్నారో లేదో చెప్పాలి. కచ్చితంగా 25 years పని చెసాక ఏబై వెలు ఇప్పించటనికి నేను సిద్ధం.

✓ ఆర్టీసీ నష్టాలు తప్ప లాభాలు తేవటం లేదు. Private చేయాల్సిందే.
ఆర్టీసీ బస్సు ఎక్కితే ఎంత దూరమైనా సురక్షితంగా గా కళ్ళుమూసుకొని వెళ్లచు అని భరోసా ఇవగలిగిండి. రోడ్డు మీద దారి తప్పినప్పుడు ముందు ఉన్న ట్రాఫిక్ పోలీస్ కంటే బస్సు లో ఉన్న కండక్టర్ నే ఎవరైనా అడుగుతారు.
Hyderabad కొత్తగా వచ్చిన btech నిరుద్యోగుల ను అడగండి, ఎన్ని సార్లు పదిహేను రుపెయిల టికెట్ తో అమేర్పెట్ నుంచి HITECH CITY interview la kosam vellaro. prati roju పల్లెటూరు ల నుంచి ఎంత మంది సిటీ కి engineering, డిగ్రీలు చదవటానికి బస్సు లో వస్తున్నారో. ఎప్పటికీ రైల్, ఎన్నికల తర్వత గెలిచిన ఎమ్మెల్యే ఒక్క రోజు అయిన ఆగని ఉర్లలో ఆర్టీసీ బస్సు అంబులెన్స్, ప్రయాణ కష్టాలు తీర్చే అతిధి.
బస్సు పాసులు ఇస్తాం, ఉచిత ప్రయాణం కల్పిస్తాం అని చెప్పి గెలిచిన నాయకులు మరి వాటి వల్ల ఆర్టీసీ మీద పడే భారం ఏ చెప్పారు. అప్పుడు మాత్రం ఆర్టీసీ తమదే అంటారు.

✓ ప్రైవేట్ బస్సులు లాభాలు తెస్తున్నాయి, ఆర్టీసీ తేవటం లేదు అని దొర అనగానే నమ్మేసే గొఱ్ఱెలరా, ఆర్టీసీ లాభాలు తేవటానికి పెట్టలేదు. ప్రజల అవసరం తీర్చటినికి పెట్టారు. అది త్రిరుతుందా లేదా అని చూడాలి తప్ప లాభం చూడకుడొడు. నీకు లాభం రవ్ట్లేదని government ఆసుపత్రి లో కూడా రేట్స్ పెంచితే అప్పుడు కూడా తల ఉపుతవా? ప్రైవేట్ చేస్తే, డిపో లో తీరిగే బస్సులన్నీ ఎమ్మెల్యే ఎంపీ తమ ట్రావెల్స్ కి వాడేసిన బస్సులే తీసుకొచ్చి పడేస్తారు. Hyderabad to khammam 280 చిల్లర ఉన్న టికెట్ 600 వందల చేస్తారు.
మరి ప్రైవేట్ డ్రైవర్లు ఉంటే పరిస్తితి చెప్పనవరంలేదు, లారీలు నడిపే వాళ్ళు ఆర్టీసీ బస్ స్టీరింగ్ తిప్పుతారు.

✓ ఎందుకు ఆర్టీసీ నీ government lo కలపాలి? పాతిక ముప్ప యేళ్లు సంస్థ కి రేయనక వానానక పని చేసి వొళ్ళు హూనం చేసుకొని రిటైర్ అయితే మీరు రోజూ బస్సులో నవ్వుతూ చూసే కండక్టర్ డ్రైవర్లకు వచ్చే పెన్షన్ నెలకు 2-3 వెలు. మరి వాటితో ఇంటి రెంట్ కట్టాలా, మందులు కొనుకోవలా? తెలిసిన retired conductor ki eddaru kutullu, ఉద్యోగం అంతా ఇద్దరినీ చదివించి,పెళ్ళిలు చేయటానికే సరిపోయింది. Accident ayi ప్రాణం పోతే..ఇంట్లో pension tisukunna వెయ్యి రూపాయిలు తప్ప పాడే తీసాక వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టనికి కూడా అప్పు చేయలోసోచింది. pf క్యాష్ ఉద్యోగ సమయంలో చేసిన అప్పులకి పొగ మిగిలేది government కొలువు లో చేశారు అనే బిరుదు మాత్రమే. Government lo unna సంస్థల్లో ప్రజల అవసరం ఏమాత్రం అవినీతి కి తావు లేకుండా, ప్రేమ గా public ki chesedi RTC మాత్రమే .

✓ తెలంగాణ ఉద్యమం లో మదత్తు కోసం సంక కలిపిన యూనియన్ లను ఇప్పుడు ఎందుకు రద్దు చేయమంటునారు? ఉద్యమం అనే మాట మీ సొంతమా? మొన్న రైతులు ఉద్యమించి దొర కూతురుని ఎన్నికల్లో ఇంటికి పంపినారు. ఈసారి కార్మికుల సమాధానం కి సిద్దం గా ఉన్నారా?

✓ అక్టాబర్ 3 న సమ్మె స్టార్ట్ అయింది. కానీ దొర కార్మికులు పని చేసిన September జీతాలు కూడా అపుజేసినరు. ఎందుకు? పని చేయించుకొని బువ్వ పెట్టకపోతే మరి కార్మికులను మోసం చేసినట్లు కాదా? కోర్టు అడిగినట్టు ఒక్క huzurnagar కే వంద కోట్లు ఇవగలిగినపుడు, పని చేస్తున్న కార్మికులకు అందుకు ప్రేమగా పిలిచి చర్చించరు.

✓ రెండు రోజుల కిందట ఐకాస ఒక మెట్టు కిందకు దిగి మారి government lo కలిపే విషయం పక్కన పెట్టేసి మిగిలిన డిమాండ్స్ చూడమని అడిగిన ఎందుకు అహంకారం చూపిస్తున్నారు? ఎలాగైనా ఆర్టీసీ నీ ప్రైవేట్ ట్రావెల్ బస్సులు తో నింపాలి అని చూస్తున్నారా? మీ బంధువుల కి ఎంత మందికి private travels ఉన్నాయి దొర? ఆర్టీసీ లండ్స్ పెట్రోల్ బంక్ లు అని ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లినట్లు బస్సులు వెళ్తాయి?

✓ ఆర్టీసీ ప్రైవేట్ చేస్తే, పల్లెటూరు లో బస్సు ఎక్కిన ఒక రైతన్నకు మన ఆర్టీసీ కండక్టర్ ఇచ్చే గౌరవం ప్రైవేట్ వ్యక్తులు ఇస్తారా? ఆటో వాల చూపించే చిరాకులు మనకి తెలినవ? పల్లెటూరు లో సామాన్యులు భయపడకుండా బస్సుల ఎక్కగలుగుతరా? వారి జేబు బరించే విధంగా ఉంటాయి ధరలు? వెయ్యి రూపాయలు వేరే company lo vastayi ante switch kotte vallu kuda సంస్థ నే అమ్మ గా చూస్తూ, ప్రణయనికుల సేవ నే కర్తవ్యం గా భావించే కార్మికుల లను దొర తో కలిసి అవహేళన చేయడం భాదాకరం.
మూడు నెళ్ళ జీతాలు లేక సమ్మె కొనసాగిస్తున్న కార్మికుల పిల్లలు స్కూల్ ఫీస్లు కట్టెల్నాందుకు క్లాస్ బయట నిలుచుతునారు. కిరాణ షాప్ వాడు ఇంటికి ఎప్పుడు వచ్చి అవమానిస్తాడు అని బయపడ్తూ ఇంట్లో ఉన్న ఆడపడుచులు బిక్కు బిక్కు గా ఉంటునారు. వారి హక్కుల కోసం ముందుకు సాగుతున్న కార్మికుల గురించి దొర తనకు అనుకూలంగా, సమ్మె కి మసి పుసెందుకు చెప్పింది కాకుండా నిజాలు తెల్సుకోవలి.
యాబేయివెల కుటుంబాలు పస్తులు ఉండే కాలం ముందు రావచ్చు.

నీకు ఆర్టీసీ బస్లు లేకపోవటం వల్ల ఇబ్బంది ఉంది అంటే, ఆర్టీసీ సేవ ను ను గుర్తించినట్టు, సమస్య పరష్కారమావల్లి అంటే దొర గారిని అడగాలి కానీ తమ హక్కుల పోరాటం చేస్తున్న కార్మికులను అడిగే హక్కు నీకు లేదు.

Here my proof of sharing on twitter.

https://twitter.com/Hungryharish/status/1200154943144939520?s=20

Authors get paid when people like you upvote their post.
If you enjoyed what you read here, create your account today and start earning FREE STEEM!
Sort Order:  

I can't really say I understand the text since I can't read Hindi but it looks to me as a massive protest. Were people arrested? Injured?

Lol you've been there yourself?

In telagana, RTC employees done strike against government for their demands and I wrote it in Telugu bro. Yes, few are arrested and done suicide also bro. Today only strikes stopped and again employees resumed their duties.

Posted using Partiko Android