devoted to God who created us with such great faculties.

in devoted •  7 years ago 

పద్యం-1086 (౧౦౮౬)

దాతవగుచు ధరను దయగలిగి యుండుము
బుట్టి నందు కిలను భూమి ఋణము
మాతృ ఋణము దీర్పు మర్యాద మరువకు
దైవ భక్తి కలిగి ధరణి మెలగు ||

భావము: ఉత్కృష్టమైన మానవ జన్మ లభించినందులకు కృతజ్ఞుడవై యుండి, దయ, దానము మొదలగు సద్గుణములను కలిగియుండవలెను. పవిత్రమైన భరతభూమి యందు జన్మించినందున, సేవా దృక్పథము నలవరచుకొని భరతమాత యొక్క ఋణము తీర్చుకోవలెను. అదే విధముగా నవ మాసములు మోసి, ఎన్నో కష్ట నష్టాలకోర్చి, మరెన్నో జాగ్రత్తలను తీసుకొని నిన్ను కని పెంచిన తల్లి యొక్క ఋణము తీర్చలేవు, కానీ ఆమె పట్ల నీ బాధ్యత మరువకుండా, చివరి వరకు శ్రద్ధతో సేవ చేస్తూ, తోడుగా నుండవలెను. సకల జగములను సృష్టించి, సుఖ జీవనమునకు కావలసిన వనరులన్నీ సమకూర్చిన భగవంతుని యెడల సర్వదా భక్తి ప్రపత్తులతో నుండుము.

As a human being, be charitable and merciful towards the needy and destitute persons. One must repay the debt to the motherland, having taken birth on this sacred soil. The mother, who carried the baby in her womb for nine months and took all such necessary care to bring the child up, must be respected and taken care of. The human being is unique in God’s creation. Having been blessed with the power of discretion, discrimination, logic and communication, one should be faithful and be devoted to God who created us with such great faculties.

Authors get paid when people like you upvote their post.
If you enjoyed what you read here, create your account today and start earning FREE STEEM!