సెన్సార్ పూర్తి చేసుకున్న రథావరం
ధర్మశ్రీ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై శ్రీ మురళి, రచితారామ్ జంటగా మంజునాథ్.ఎన్ నిర్మించిన కన్నడ చిత్రాన్ని తెలుగులో రథావరం
పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ది అల్టిమేట్ వారియర్
అనేది క్యాప్షన్. చంద్రశేఖర్ బండియప్ప దర్శకుడు. రవిశంకర్ విలన్ పాత్రలో నటించగా, చరణ్ రాజ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఈ చిత్రం కన్నడలో ఇటీవల విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలూ పూర్తి చేసుకుని ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మంజునాథ్.ఎన్ మాట్లాడుతూ...``కన్నడలో భారీ వసూళ్లు రాబట్టిన చిత్రాన్ని తెలుగులో రథావరం
పేరుతో విడుదల చేస్తున్నాం. రథావరం
అంటే నమ్మిన బంటు అని అర్థం. తెలుగు నేటివిటీకి తగిన విధంగా కొన్ని సెకండాఫ్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి తెలుగులో విడుదల చేస్తున్నాం. ఇందులో మూడు సాంగ్స్ ఉన్నాయి. ఇటీవల మ్యాంగో ఆడియో ద్వారా పాటలు మార్కెట్ లోకి విడుదల చేశాం. సోషల్ నెట్ వర్క్స్ లో మంచి కాంప్లిమెంట్స్ తెచ్చుకుంటున్నాయి.
రథావరం
కొత్త కాన్సెప్ట్ తో కొత్తగా రూపొందిన చిత్రం.రథావరం
డిఫరెంట్ కాన్సెప్ట్ తో , డిఫరెంట్ మేకింతో తెరకెక్కించాము.రథావరం
లో ఎక్స్ లెంట్ మ్యూజిక్ ఉంది. వండ్రఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి.రథావరం
లో ప్యూర్ లవ్ ఉంది, మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. త్యాగం ఉంది. నమ్మిన వారికోసం ఎంతకైనా సిద్దపడే తెగువ ఉంది. హీరో తను ప్రేమించిన అమ్మాయిని ఎలా కాపాడుకున్నాడనే అంశం ఇంట్రస్టింగ్ గా ఉంటుంది.రథావరం
లో వంద తప్పులు చేసినా...దేవుడు క్షమిస్తాడు...కానీ చేయరాని ఒక తప్పు చేస్తే మాత్రం క్షమించడు అనే అంశాన్ని మెయిన్ కథాంశంగా తీసుకున్నాం.రథావరం
లో క్లాస్ అండ్ మాస్ ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలున్నాయి.రథావరం
లో తెలుగు ప్రేక్షకులు నచ్చే ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయి.రథావరం
లో హీరో నమ్మిన వారికోసం ఏమైనా చేస్తాడు కానీ ,తన మనస్సుకు నచ్చకుంటే మాత్రం ఎలాంటివారికైనా ఎదురుతిరుగుతాడు.
రథావరం
ఆడ, మగ, తో పాటు థర్డ్ జెండర్ కూడా తప్పకుండా చూడాల్సిన చిత్రం.రథావరం
లో హిజ్రాల గురించి ఎవరికీ తెలియని ఒక రహస్యాన్ని చూపిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఆ రహస్యాన్ని తెలుసుకోని తీరాలి. ఈ సినిమా చూస్తే థర్డ్ జెండర్ యొక్క గొప్పతనం ఏంటో అర్ధమవుతుంది.రథావరం
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే యాక్షన్ లవ్ స్టోరి. ఒక పొలిటీషియన్ తన స్వార్థం కోసం హీరోతో ఎలాంటి పని చేయించడానికి సిధ్దపడతాడు. ఈ క్రమంలో హీరో ఏం తెలుసుకుంటాడు. హిజ్రాలకు ఆ పొలిటీషియన్ కు అసలు ఏంటి లింక్ అనేది స్టోరీ.రథావరం
లో ` ఆ శబరి మలై మణికంఠ పులిమీద వస్తే ఈ ఎమ్మెల్యే మాత్రం ఎనుము (దున్నపోతు) మీద వస్తాడు,
రథం కదిలితే జాతర అవుతుంది....ఈ రథావరం దొరికితే చరిత్ర అవుతుంది`` లాంటి అధ్బుతమైన డైలాగ్స్ ఉన్నాయి.రథావరం
సెన్సార్ కంప్లీట్ అయింది...``కుటుంబం అంతా కలిసి హాయిగా చూసే చిత్రమిది. క్లాస్, మాస్ ప్రేక్షకులకు నచ్చే విధమైన సన్నివేశాలు న్నాయి. ఇంత వరకూ ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా చూడలేదు అంటూ సెన్సార్ సభ్యులు మా చిత్రాన్ని ప్రశంసించడమే కాకుండా యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు.రథావరం
చిత్రం ఆగస్ట్ లో గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు
Hi! I am a robot. I just upvoted you! I found similar content that readers might be interested in:
http://m.indiaglitz.com/radhavaram-completes-censor-telugufont-news-190517.html
Downvoting a post can decrease pending rewards and make it less visible. Common reasons:
Submit