రామ చరిత జదువ రమ్యంబు జీవనం SreeRama moksha (salvation)

in sreerama •  7 years ago 

పద్యం-1085 (౧౦౮౫)
రామ చరిత జదువ రమ్యంబు జీవనం
పాప కర్మ లన్ని భస్మ మగును
రామ భజన సలుప రాజ్యంబు క్షేమంబు
రామ కోటి వ్రాయ రక్ష గలుగు ||

భావము : శ్రీ రాముని చరిత్ర యగు శ్రీమద్రామాయణము చదివినచో కలుగు ఫలములు ఇన్ని అన్ని అని చెప్పనలవి కాదు. జన్మ జన్మలనుండి పోగుచేసుకున్న పాపములన్నీ రామ నామ స్మరణ తో భస్మీపటలమౌతాయి, జీవితము ఎంతో తృప్తిగా, ఆనందమయంగా ఉంటుంది. రామ భజన నలుగురూ కలిసి చేసుకున్నప్పుడు దేశము క్షేమముగా, సుభిక్షముగా ఉంటుంది. శ్రీ రాముని పేరు "శ్రీరామ" అని కోటి సార్లు వ్రాయగలిగితే(రామకోటి) , అభయ ప్రాప్తి కలిగి , అన్ని కష్టాల నుండి విముక్తినొంది, అంత్యమున మోక్షసామ్రాజ్యమును సాధించ గలరు.

The life history of Bhagawan SreeRama is quite inspiring. Studying it in detail makes one’s life delightful and satisfying and all the sins accumulated over many births are destroyed at once. The nation will be safe and secure with the chanting / singing in praise of Sreerama. Writing his name crore time creates protection from all evils and ensures moksha (salvation) at the end.

Authors get paid when people like you upvote their post.
If you enjoyed what you read here, create your account today and start earning FREE STEEM!