మీ యోని యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే జీవనశైలి నిర్ణయాలు (Lifestyle Choices That Could Be Affecting The Health Of Your Vagina!)
మీకు తరచుగా యోనిలో దురద లేదా పొక్కులు/రాపిడి వంటి సమస్యలు ఉంటాయా? మీ సమాధానం అవును అయితే, మీరు మీ యోని యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే కొన్ని జీవనశైలి తప్పిదాలను చేస్తున్నట్లు భావించాలి. వీటి గురించి మరింత తెలుసుకోండి.
మనం మన చర్మం, కళ్లు, జుట్టు మొదలైన వాటి కోసం సంరక్షణ చర్యలు చేపడతాము. కాని మనం మన యోని యొక్క ఆరోగ్యం గురించి విస్మరిస్తాము. యోని ఒక ఆంతరంగిక భాగం, దాని అర్థం దీనికి ప్రాముఖ్యత లేదని కాదు. యోని యొక్క ఆరోగ్యం మీ పరిపూర్ణ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొన్ని సాధారణ జీవనశైలి నిర్ణయాలు వలన మీ యోనికి హాని కలగవచ్చు, ఉదా, దుస్తులు, పరిశుభ్రత లేదా రతి మొదలైనవి.
దుస్తులకు సంబంధించిన కారకాలు (Factors related to clothing):
సింథటిక్ ప్యాంటీలు (Synthetic panties)
సింథటిక్, సెక్సీ మరియు లేసీ ప్యాంటీలు చాలా ఆకర్షణీయంగా కనిపించవచ్చు, కాని వీటి వలన మీకు మంచి కంటే చెడు ఎక్కువ ఉంటుంది.
ఇటువంటి ప్యాంటీల సింథటిక్ అంశం గాలి ప్రసరణను అనుమతించదు మరియు తేమ పెరిగిపోతుంది. ఈ మారిన పరిస్థితులు వలన యోని ఇన్ఫెక్షన్‌లు సంభవిస్తాయి. మీరు ఈ ఫ్యాన్సీ ప్యాంటీలను మీ పడక గదిలో ధరించడానికి పరిమితం చేసుకోవడం మంచిది మరియు రోజువారీ వాడకం కోసం 100% కాటన్ ప్యాంటీలను ధరించాలి.
థాంగ్స్ (Thongs)
మీ ప్యాంట్‌లు మరియు ట్రాక్ ప్యాంట్‌ల్లో ప్యాంటీ లైన్‌లను దాచడానికి థాంగ్స్ ఉత్తమం, కాని వీటి వలన పలు ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయి. థ్యాంగ్స్ మీ యోని మరియు గుదంకు బాగా బిగుతుగా ఉంటాయి. మీరు నడుస్తున్నప్పుడు థాంగ్స్ ముందుకు మరియు వెనుకకు ఎక్కువగా స్లైడ్ అవుతుంది, దీని వలన గుదం నుండి యోనికి బ్యాక్టీరియా సోకుతుంది.
మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్‌లు ఉన్నట్లయితే, థాంగ్స్ వలన మరింత తీవ్రంగా మారవచ్చు. రోజూ ధరించడానికి వదులుగా ఉండే కాటన్ ప్యాటీలను ఎంచుకోవడం మంచిది మరియు థాంగ్స్‌ను ప్రత్యేక సందర్భాల్లో ధరించడం మంచిది.
షేప్‌వేర్ (Shapewear)
టమ్మీ టక్కర్‌లు లేదా వెయిస్ట్-సించింగ్ కార్సెట్‌లు వంటి షేప్‌వేర్‌ను ఉబ్బెత్తుగా ఉండే పొట్టను బిగుతుగా ఉండే దుస్తుల్లో దాచడానికి లేదా సరైన శరీర ఆకృతిలో కనిపించడానికి ధరించడం మంచిది, ఈ దుస్తులు వలన మీరు కనిపించే తీరు మెరుగుపడటం కంటే ఎక్కువగా ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయి. ఈ షేప్‌వేర్‌లు చాలా బిగుతుగా ఉంటాయి మరియు ఈ కారణంగా నాడులు ప్రభావితం కావచ్చు మరియు ప్రసరణ తగ్గిపోతుంది. ఈ సమస్యల వలన మీ బాహ్య అవయవాలకు చక్కిలిగింతలు మరియు తిమ్మిరి సంభవించవచ్చు. మీరు షేవ్‌వేర్‌లను ఉపయోగించడం వలన మంచి శరీర ఆకృతిని పొందవచ్చు, కాని వాటి వలన మీకు అసౌకర్యం మరియు ఇన్ఫెక్షన్‌లో సోకే ప్రమాదవకాశాలు పెరుగుతాయి.
స్కిన్నీ జీన్స్ లేదా బిగుతుగా ఉండే ప్యాంట్‌లు (Skinny jeans or tight pants)
స్కిన్నీ జీన్స్ నేటి ఫ్యాషన్ ట్రెండ్ కావచ్చు, కాని అవి మీ రహస్య భాగాల ఆరోగ్యానికి నిజంగా మంచివేనా? బిగుతుగా ప్యాంట్‌లు వలన వాల్వా రాపిడికి గురవుతుంది మరియు చికాకు పుడుతుంది. ఈ చికాకు వలన చర్మం ఎర్రగా, దురదగా కొన్నిసార్లు పొక్కులు కూడా సంభవించవచ్చు. బిగుతుగా ఉండే జీన్స్ వలన చర్మానికి తగినంత గాలి ఆడదు, తేమ మరియు వేడి ఉండిపోతాయి మరియు ఇవి యిస్ట్ మరియు బ్యాక్టీరియా ఏర్పడటానికి తగిన పరిస్థితులను ఏర్పరుస్తాయి. కనుక ఈ స్కిన్నీ జీన్స్‌ను అరుదుగా మాత్రమే ధరించాలి మరియు సాధారణ సమయంలో అత్యంత సౌకర్యవంతమైన కాటన్ ప్యాంట్‌లు ధరించాలి.
శుభ్రతకు సంబంధించిన కారకాలు (Factors related to hygiene)
శుభ్రం చేసుకునే పద్ధతి (Washing technique)
యోనితో పోల్చుకున్నప్పుడు గుదంలో ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుంది. కనుక, జననావయవాలను యోని నుండి గుదం వరకు శుభ్రం చేసుకోవాలి. గుదం నుండి యోని వరకు శుభ్రం చేసుకోవడం వలన గుదం నుండి యోనికి బ్యాక్టీరియా సంక్రమిస్తుంది మరియు యోని ఇన్ఫెక్షన్‌లు సంభవిస్తాయి.
డూషింగ్ (Douching)
డూష్ అంటే ఫ్రెంచ్ భాషలో "శుభ్రం" లేదా "నానబెట్టడం" అని అర్థం. డూషింగ్‌లో యోనిని నీటితో లేదా నీరు మరియు వెనీగర్ కలిపిన మిశ్రమంతో శుభ్రం చేస్తారు. డూష్ ఒక సీసా లేదా సంచిలో అందుబాటులో ఉంటుంది మరియు యోనిలోకి గొట్టం ద్వారా పిచికారి చేస్తారు. డూషింగ్ వలన యోనిలో ఉండే మంచి బ్యాక్టీరియా సహజ సంతులనానికి అంతరాయం కలుగుతుంది. తరచూ డూషింగ్ చేయడం వలన మహిళల్లో యిస్ట్ ఇన్ఫెక్షన్‌లు, ఎస్‌టిడిలు మరియు వంధ్యత్వం వంటి సమస్యలు సంభవించే ప్రమాదవకాశాలు పెరుగుతాయి. వైద్యుల సూచన మేరకు, వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి మరియు యోనిని ఆరోగ్యంగా ఉంచడానికి డూషింగ్ చేయాల్సిన అవసరం లేదు.
ప్యూబిక్ రోమాలను తొలగించడం (Removing pubic hair)
ప్యూబిక్ రోమాలను తొలగించడం అనేది నేటి మహిళలు ఎక్కువగా ఆచరించే క్రియ. ప్యూబిక్ రోమాలను వ్యాక్సింగ్, రోమాల తొలగింపు క్రీమ్‌లు లేదా షేవ్ చేయడం ద్వారా తొలగిస్తారు. ఇవి చర్మ ఒరిపిడి లేదా గాయం సంభవించడానికి కారణమైన రాపిడి నుండి సంరక్షణను అందిస్తాయి మరియు బ్యాక్టీరియా మరియు పరాన్నజీవుల నుండి కూడా సంరక్షణను అందిస్తాయి. కనుక, రోమాలు లేని యోనికి సమస్యలు ఎక్కువగా ఉంటాయి మరియు పలు రకాల ఇన్ఫెక్షన్‌లు సోకవచ్చు. ఇంకా, రోమాల తొలగింపు విధానం వలన గాయాలు మరియు ఇన్ఫెక్షన్‌లు సంభవించవచ్చు.
శ్యానిటరీ నాప్కిన్స్/ట్యాంపూన్స్ (Sanitary napkins/tampons)
పలు బ్రాండ్‌ల శ్యానిటరీ నాప్కిన్ తయారీదారులు వారి ప్యాడ్‌లను 8-10 గంటలపాటు ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఇటువంటి వ్యాపార ప్రకటనలతో మోసపోకండి. యోని నుండి వచ్చే బహిష్టు రక్తస్రావం బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతుంది. శ్యానిటరీ ప్యాడ్‌ను ఎక్కువ సమయంపాటు ఉపయోగించినట్లయితే, రక్తం, చెమ్మ, వేడి, చెమట మరియు యోని సూక్ష్మజీవులు వలన యోని మరియు మూత్ర నాళ ఇన్ఫెక్షన్‌లు సంభవిస్తాయి. ప్రతి 4-6 గంటలకు ఒకసారి శ్యానిటరీ ప్యాడ్‌ను తప్పక మార్చాలి మరియు ట్యాంపూన్‌లను ప్రతి 2 గంటలకు ఒకసారి మార్చావి.
సువాసన వచ్చే వైప్‌లు మరియు యోని డియోడ్రెంట్‌లు (Scented wipes and vaginal deodorants)
సువాసన వచ్చే వైప్‌లు, స్ప్రేలు, డియోడ్రెంట్‌లు మరియు సువాసన ద్రవాలతో శుభ్రం చేయడం వలన మీ యోనికి మంచి కంటే చెడే ఎక్కువగా ఉంటుంది. ఈ ఉత్పత్తుల్లోని పెర్ఫూమ్ మరియు రసాయనాలు వలన చికాకు పుడుతుంది మరియు యోని చుట్టూ ఉండే ప్రాంతాల్లో వాపు సంభవిస్తుంది. యోని సహజ వాసనను కలిగి ఉంటుంది మరియు మీ బహిష్టు చక్రంలోని విభిన్న దశల్లో ఇది మారుతూ ఉంటుంది. మీకు దుర్వాసన వస్తున్నట్లయితే, మీకు వైద్య చికిత్స అవసరమైన ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది.
లైంగిక చర్యకు సంబంధించిన కారకాలు (Factors related to sex):
సువానస గల కండోమ్‌లు (Flavoured condoms)
సువాసన గల కండోమ్‌లను నోటి ద్వారా జరిగే లైంగిక చర్య కోసం రూపొందించారు మరియు లైంగిక చర్య కోసం కాదు. అవి సాధారణంగా చక్కెర మరియు మీ రుచికి తగినట్లు పెర్ఫ్యూమ్‌ను కలిగి ఉంటాయి. చక్కెర మరియు పెర్ఫ్యూమ్ రెండింటి వలన కూడా యోనికి హాని కలుగుతుంది మరియు ఇన్ఫెక్షన్‌లు సంభవిస్తాయి. కనుక, ఈ కండోమ్‌లను నోటి ద్వారా లైంగిక చర్య కోసం ఉపయోగించడం మంచిది.
యోని ల్యూబ్రికెంట్‌లు (Vaginal Lubricants)
చాలామంది మహిళలు యోని పొడిబారే సమస్య మరియు లైంగిక చర్యకు సంబంధించిన నొప్పి నుండి ఉపశమనం కోసం, యోని ల్యూబ్రికెంట్‌లను ఉపయోగిస్తారు. పలు రకాల ల్యూబ్రికెంట్‌లు అందుబాటులో ఉన్నాయి, అంటే నీరు ఆధారిత, సిలికాన్ ఆధారిత మరియు తైలం ఆధారిత మొదలైనవి. తైలం ఆధారిత ల్యూబ్రికెంట్‌లు (బేబీ ఆయిల్ మరియు పెట్రోలియం జెల్లీ) ఉపయోగించరాదు ఎందుకంటే వాటి వలన యోని రాపిడికి గురవుతుంది మరియు కండోమ్ విచ్ఛిన్నం అయ్యే మరియు లైంగికంగా వ్యాపించే వ్యాధుల ప్రమాదవకాశాలు కూడా పెరుగుతాయి.
యోని ఛిద్రణలు (Vaginal Piercings)
జననావయవ ఛిద్రణలు లేదా యోని ఆభరణాల ట్రెండ్ ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. అత్యంత జనాదరణ పొందిన యోని ఛిద్రణలు అంతర్గత ఓష్ఠా ఛిద్రణలు, క్లిటోరియస్ ఛిద్రణలు మరియు క్లిటోరల్ హుడ్ ఛిద్రణలు. వీటిని లైంగిక ఆనందం పెంచుకోవడానికి చేయించుకుంటారు. మీరు జననావయవ ఛిద్రణం చేయించుకోవడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఎందుకంటే దీని వలన రక్తస్రావం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, నాడీకి గాయం, నగలకు అలెర్జీ ప్రతిక్రియ మరియు మందమైన మచ్చ వంటి పలు సమస్యలు సంభవిస్తాయి. హెపటైటిస్ బి మరియు సి, హెచ్ఐవి మరియు ఎస్‌టిడిలు సోకే ప్రమాదాలు కూడా ఎక్కువ.
సెక్స్ టాయ్స్ (Sex toys)
సెక్స్ టాయ్స్ వలన మీ లైంగిక జీవితంలో అదనపు ఆనందం లభిస్తుంది, కాని వాటి వలన కూడా సమస్యలు సంభవిస్తాయి. ముఖ్యంగా రబ్బర్ లేదా జెల్ ఆధారిత సెక్స్ టాయ్స్ సురక్షితం కాదు. ఈ టాయ్స్ ఆరిగిపోతాయి మరియు రంధ్రాలు మరియు సామగ్రి మెడల్లో హార్బర్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఈ బ్యాక్టీరియా వలన ఇన్పెక్షన్‌లు సంభవిస్తాయి. మీరు సెక్స్ టాయ్ ఉపయోగించిన తర్వాత శుభ్రం చేసినప్పటికీ, బ్యాక్టీరియా అలానే ఉండిపోతుంది, తర్వాత ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తుంది.
ఆరోగ్యవంతమైన యోనిలో ఇన్పెక్షన్‌లను నివారించడానికి సహాయపడే ఆమ్ల ph మరియు అత్యధిక సంఖ్యలో ప్రయోజనకర బ్యాక్టీరియా ఉంటుంది. ఆరోగ్యవంతమైన యోని కొద్ది మొత్తంలో స్రావాలను కూడా ఉత్పత్తి చేస్తుంది , ఇది యోని తేమగా మరియు శుభ్రంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఈ సాధారణ లక్షణాలకు ఏవైనా అంతరాయం కలిగితే చికాకు మరియు ఇన్ఫెక్షన్‌లు సంభవిస్తాయి. కనుక , గుడ్డిగా ఫ్యాషన్ మరియు తాజా ట్రెండ్‌లను అనుసరించవద్దు. తెలివిగా ఆలోచించి , మీకు ఆరోగ్యవంతమైన మరియు సౌకర్యవంతమైనవి ఎంచుకోవాలి !
✅ @narahari24, I gave you an upvote on your first post! Please give me a follow and I will give you a follow in return!
Please also take a moment to read this post regarding bad behavior on Steemit.
Downvoting a post can decrease pending rewards and make it less visible. Common reasons:
Submit